ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీ.. ఆ ప్రచారం 'చీప్' అన్న ట్రంప్

19-04-2026 Sun 13:25 | International
Advertisement
  • టిప్స్‌పై పన్ను రద్దు పాలసీ వార్షికోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్న ట్రంప్ 
  • ఓవల్ ఆఫీస్‌కు డోర్‌డాష్ డ్రైవర్‌తో మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు తెప్పించుకున్న వైనం
  • అయితే కొద్ది రోజులకే ఆ కార్యక్రమం "చీప్‌గా, ఇబ్బందికరంగా" ఉందని వ్యాఖ్య
  • ఈ ప్రచారంలో పాల్గొన్న డెలివరీ డ్రైవర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు 
  • అది నిజమైన డెలివరీ కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిందని డోర్‌డాష్ వివరణ
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ప్రారంభించిన ఒక కార్యక్రమాన్ని కొద్ది రోజులకే ఇబ్బందికరంగా, చీప్‌గా ఉందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. "టిప్స్‌పై పన్ను రద్దు" విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రంప్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా డోర్‌డాష్ డెలివరీ డ్రైవర్ ద్వారా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌కు మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లను తెప్పించుకున్నారు.

అర్కాన్సాస్‌కు చెందిన రిపబ్లికన్ మద్దతుదారు షారన్ సిమన్స్ అనే డెలివరీ డ్రైవర్, బర్గర్‌లు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌తో ఉన్న రెండు బ్యాగులను తీసుకురాగా, ట్రంప్ స్వయంగా వాటిని అందుకున్నారు. ఈ పాలసీ వల్ల షారన్‌కు 11,000 డాలర్లు ఆదా అయ్యాయని వైట్‌హౌస్ వర్గాలు అప్పుడు ప్రచారం చేశాయి.

అయితే, ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే లాస్ వెగాస్‌లో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ఈ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. "రాజకీయాల్లో కొన్నిసార్లు ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే, ఓవల్ ఆఫీస్‌కు మెక్‌డొనాల్డ్స్ డెలివరీ చేయించడం కొంచెం చీప్‌గా అనిపించింది" అని అన్నారు. తన 2024 ప్రచారంలో భాగంగా బర్గర్ షాపులో ఫ్రైస్ వడ్డించడం, సేఫ్టీ జాకెట్ వేసుకుని చెత్త ట్రక్కు ఎక్కడం వంటివి కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలే అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఈ డెలివరీ కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్ షారన్ సిమన్స్ విషయంలోనూ వివాదం చెలరేగింది. గతంలో ఆమె కాంగ్రెస్ ముందు ఇదే పాలసీకి మద్దతుగా సాక్ష్యమిచ్చినప్పుడు తనను నెవాడా నివాసిగా పేర్కొన్నారు. కానీ, ఈ కార్యక్రమానికి అర్కాన్సాస్ నుంచి వచ్చినట్టు పరిచయం చేయడంతో ఆమె నిజమైన డ్రైవరా? లేక నటిస్తున్నారా? అనే దానిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ విమర్శలపై డోర్‌డాష్ ప్రతినిధి జూలియన్ క్రౌలీ స్పందిస్తూ.. "అది నిజమైన డెలివరీ కాదని అందరికీ తెలుసు. ఒక కొత్త పాలసీని తెలియజేయడానికి ప్రణాళిక ప్రకారం నిర్వహించిన కార్యక్రమం అది. షారన్‌ను నటి అనడం పూర్తిగా తప్పు. ఆమె నిజమైన డ్యాషర్ (డ్రైవర్), తనకు ప్రయోజనం కలిగించే పాలసీకి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు" అని వివరణ ఇచ్చారు.
Advertisement
Donald TrumpTrumpOval OfficeMcDonaldsDoorDashSharon SimmonsTax cutsUS PoliticsWhite HouseBurger delivery

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more